Indian Railways News => Topic started by railgenie on Oct 22, 2012 - 23:30:29 PM


Title - kaveri exp accident
Posted by : railgenie on Oct 22, 2012 - 23:30:29 PM

పట్టాలు తప్పిన కావేరి ఎక్స్‌ప్రెస్...పలువురికి గాయాలు

చిత్తూరు, అక్టోబర్ 22 : జిల్లాలోని కుప్పం మండలం మల్లనూరు దగ్గర సోమవారం తెల్లవారు జామున మైసూరు నుంచి చెన్నై వెళ్తున్న కావేరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఒక బోగి పట్టాలు తప్పి కొద్ది దూరం వరకు వెళ్లి ఓ పక్కగా ఒరిగింది. అనంతరం మరో ఐదు బోగీలు కూడా పక్కగా ఒరిగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిని ఓ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు అక్కడకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. రైలు పట్టాలు తప్పటంతో ఆ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.