| ఇంటర్సిటి రైలులో పొగలు by railgenie on 23 December, 2012 - 09:00 PM | ||
|---|---|---|
railgenie | ఇంటర్సిటి రైలులో పొగలు on 23 December, 2012 - 09:00 PM | |
డోర్నకల్, డిసెంబర్ 22: గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఇంటర్సిటి ఎక్స్‌ప్రెస్ రైలు రెండు బోగీలలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా పొగలు వెలువడటంతో భయంతో ప్రయాణికులు కిందకు దూగిన సంఘటన వరంగల్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంటర్సిటి రైలు డోర్నకల్ జంక్షన్‌కు కొద్ది దూరంలో ఉండగానే డి-6, డి-7రిజర్వేషన్ బోగీలలో రెండు ట్యూబ్‌లైట్లతో పాటు ఫ్యాన్‌కు షార్ట్‌సర్క్యూట్ జరగగానే అంథకారం ఏర్పడింది. అంతలోనే పొగలు వస్తుండటంతో భయపడిన ప్రయాణికులు ఆందోళనకు గురై రైలు డోర్నకల్‌కు నెమ్మదిగా చేరుకుంటుండగానే రైల్లోంచి కిందకు దూకారు. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు సాంకేతిక నిపుణులను పిలిపించి తక్షణం మరమ్మతు చేపట్టి అనంతరం విద్యుత్ ప్రసారాన్ని పునరుద్ధరించి రైలును పంపించారు. దీనికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు తెలిపారు. | ||